శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌ల్గిన లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లో ప్ర‌సిద్ధి చెందిన‌ శ్రీ క‌న‌కాల క‌ట్ట మైస‌మ్మ దేవాల‌యంలో నేటి ( సోమ‌వారం ) నుంచి అక్టోబ‌ర్ 2 వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు జ‌రుగ‌నున్న‌ట్లు ఆల‌య వ్య‌వ‌స్థాప‌క ధ‌ర్మ‌క‌ర్త‌, ఛైర్మ‌న్ గోల్కొండ గౌత‌మ్ కుమార్ ప‌టేల్‌, ఆల‌య కార్య‌నిర్వాహ‌ణాధికారి కె.సాంబ‌శివ‌రావు లు తెలిపారు. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల‌కు సంబంధించిన బ్రోచ‌ర్‌ను వారు ఆల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ…. నేటి నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ఆల‌యంలో అమ్మ‌వారి ప్ర‌తి రోజు వివిధ రూపాల‌లో అలంక‌రించి విశేష పూజ‌ల‌ను నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా తొలి రోజు అయిన‌ సోమ‌వారం రోజు అమ్మ‌వారిని శ్రీ బాల‌త్రిపుర సుంద‌రీదేవీ రూపంలో, 23 వ తేదీన శ్రీ మంగ‌ళ గౌరీ దేవిగా, 24వ తేదీన శ్రీ గాయిత్రిదేవిగా, 25వ తేదీన శ్రీ కాత్యాయ‌ని దేవిగా, 26వ తేదీన శ్రీ మ‌హాల‌క్ష్మీ దేవిగా, 27వ తేదీన శ్రీ ల‌లితాదేవిగా, 28వ తేదీన శ్రీ అన్న‌పూర్ణ దేవిగా, 29వ తేదీన శ్రీ స‌ర‌స్వ‌తి దేవిగా, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి రూపంలో అలంక‌రిస్తామ‌న్నారు. అక్టోబ‌ర్ 1వ తేదీన శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవిగా, 2వ తేదీన శ్రీ మ‌హిషాసురమ‌ర్థిని దేవిగా అమ్మ‌వారిని అలంక‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యాన్ని విద్యుత్ దీపాల‌తో, పూల‌తో అలంక‌రించామ‌న్నారు. ఈ స‌మావేశంలో ఆల‌య సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page