శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు



హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో నేటి నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో అమ్మ‌వారిని వివిధ రూపాల్లో అలంక‌రించ‌నున్న‌ట్లు ఆల‌య ఈవో బి.జ్యోతి తెలిపారు. నేడు ( సోమ‌వారం ) రోజున అమ్మ‌వారిని బాలాత్రిపురసుందరీదేవిగా, 23 వ తేదీన శ్రీ గాయత్రి దేవిగా, 24 వ తేదీన శ్రీ అన్నపూర్ణా దేవిగా, 25 వ తేదీన శ్రీ మంగళగౌరి దేవిగా, 26 వ తేదీన శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 27 వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దేవిగా, 28 వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, 29 వ తేదీన శ్రీ సరస్వతీ దేవిగా, 30వ తేదీన దుర్గా దేవిగా, అక్టోబ‌ర్ 1వ తేదీన మ‌హిషాసురమ‌ర్ధిని దేవిగా, 2వ తేదీన భ‌వాని దేవి రూపంలో అమ్మవారిని అలంక‌రించి విశేష పూజ‌ల‌ను నిర్వ‌హించనున్న‌ట్లు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page