హైదరాబాద్, జూన్ 3, అద్దం న్యూస్ : ముషీరాబాద్ రెవెన్యూ మండలం పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. కవాడిగూడ డివిజన్ లోయక్ ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ తహశిల్థార్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు. ముషీరాబాద్ తహశిల్థార్ రాణా ప్రతాప్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ నేతలు ఎం.ఉమేష్, శివ కుమార్, ఆనంద్ రావు, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జొహేర్ హుస్సేన్, మారిశెట్టి నర్సింగ్‌రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, మహ్మద్ అలీ, కరికె కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply