Friday, September 18, 2026
HomeHyderabadపలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

 

హైదరాబాద్, అద్దం న్యూస్  హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా హైదర్‌న‌గ‌ర్ నుంచి ఆల్వాల్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు షాపూర్‌న‌గ‌ర్ వద్ద మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నేప‌ధ్యంలో ఈ నెల 12 వ తేదీ శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 15 గంటల పాటు జలమండలి ఓ అండ్ ఎం డివిజన్-12 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు :

ఓ అండ్ ఎం డివిజన్-12 ( షాపూర్ నగర్ ) : షాపూర్‌నగర్, సంజయ్ గాంధీనగర్, కలావతి నగర్, హెచ్ఎంటి సొసైటీ, హెచ్ఏఎల్ కాలనీ, టిఎస్ఐఐసి కాలనీ, రోడ మేస్త్రి నగర్, శ్రీనివాస్‌న‌గ‌ర్‌, ఇందిరానగర్, గాజులరామారం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాస్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కైసర్ నగర్, గాజులరామారం గ్రామం ప్రాంతాలు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page