హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రతి మహిళ సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని కవాడిగూడ కార్పొరేటర్ జి.రచన శ్రీ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ శెట్టి బలిజ సంక్షేమ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఆమె సన్మానించారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేటర్ జి.రచన శ్రీ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. 
ఈ సందర్భంగా కార్పొరేటర్ రచన శ్రీ మాట్లాడుతూ… మహిళలు అన్నిరంగాలలో పురుషులకు సమానంగా ముందుకు వెళుతున్నారన్నారు. ఎక్కడ మహిళలు ధైర్యంతో ముందుకు వెళుతుందో సమాజంలో తమకంటూ ప్రత్యేకత ఉంటుందన్నారు. అప్స లాంటి స్వచ్ఛంద సంస్థలు వివిధ బస్తీల మహిళలను ఒక్క చోటికి తీసుకుని వచ్చే స్థానిక మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ యువజన అవార్డు గ్రహహిత చెక్కిలి మధు మాట్లాడుతూ… తల్లి దండ్రులు ఆడ పిల్లల పై లింగ వివక్షణ చూపా రాదన్నారు. ప్రతి ఒక్కరూ ఆడ మగ తేడా లేకుండా సమానంగా చూడాలని అన్నారు. ప్రతి మహిళ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని స్త్రీ ఎప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడే సరైన పరిష్కారం న్యాయం జరుగుతుందన్నారు. నగర అరోగ్య కేంద్రం సూపర్‌వైజర్ అమృత మాట్లాడుతూ…మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగి ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అప్స సంస్థ సామాజిక కార్యకర్త బొట్టు రమేశ్ మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలంటే సాధన ఎంతైనా అవసరమన్నారు. తాము సాధించిన విజయాలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్స స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శ్రావణి, లావణ్య, మల్లిక, ఇందిర, బీజేపీ నాయకులు జి.వెంకటేష్, కుమార్ గౌడ్, ఏఎన్ఎం, ఆశ వర్కర్స్ సరస్వతి, వివిధ బస్తీలోని మహిళలు పాల్గొన్నారు.












Leave a Reply