పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
హైదరాబాద్, జనవరి 18, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల గ్రౌండ్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా ముగ్గులను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ… పద్మశాలీలు రాజకీ యంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం అధ్య క్షుడు అతినగరం సుదేష్ మాట్లాడుతూ… ఈ ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను ఈ నెల 26 వ తేదీన ఇందిరాపార్క్‌లో జరుగనున్న పద్మశాలి మేళాలో అందజేస్తామన్నారు.
అధ్య క్షుడు అతినగరం సుదేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజు, ముషీరాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘం నాయకులు మంథెన దశరథ్, బొట్టు తిరుపతి, బోనం ఊర్మిళ, బోడ నిర్మల, గుర్రం చంద్రకళ, గుంటక రూప, కైరంకొండ స్వరూప, అనుశ్రీ, బొమ్మర్ల సతీష్, నారాయణమూర్తి, సోమ సతీష్, సెరిపల్లి గణేష్, బోనమ్ బన్నీ, ఎయిర్టెల్ రాజు, బొట్టు శ్రీనివాస్, ఆంజనేయులు, తుమ్మ శ్రీను, అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంగుప్త, పెండెం శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()

