Friday, September 18, 2026
HomeNationalబిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు – మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు

హైదరాబాద్, నవంబర్ 29, అద్దం న్యూస్ : బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు పోరాటం ఆగ‌దని మ‌హాధ‌ర్నాలో వ‌క్త‌లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిలిపివేసి, స్థాని క సంస్థలు, విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టు తదితర అన్ని రంగాలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ‌నివారం హైద‌రాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిం చారు. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ మ‌హాధ‌ర్నాకు మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, బిసి జేఏసి ఛైర్మ‌న్ ఆర్.క్రిష్ణ‌య్య‌, రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ చంద్ర‌కుమార్‌, బిసి జేఏసి ఛైర్మ‌న్ జాజుల శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్సి మ‌ధుసూద‌నా చారి లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… బీసీలకు 42 శాతం రిజర్వే షన్ల అంశాన్ని మధ్యలోనే వదిలేయడం ప్రభుత్వ బీసీ వ్యతిరేక ధోరణిని బయటపెడుతోందని అన్నారు. ట్రిపుల్ టెస్ట్ అమలుపై వచ్చిన పిటిషన్లలో జరిగిన అ న్యాయాన్ని సవరించే అవకాశముండి కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కళ్ళుమూసుకుందని మండిపడ్డారు. 75 సంవత్సరాలుగా బీసీలకు రావాలసిన సముచిత హక్కులను అడ్డుకునే కుట్రలో కేంద్రం, రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలు కూడా అగ్రవర్ణ ఒత్తి ళ్లకు లోనవుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ… రెండు సంవ త్సరాలు పూర్తి చేసుకున్న రెడ్డి ప్రభుత్వము బీసీల హక్కుల విషయంలో పూర్తిస్థాయి వైఫల్యాన్ని చాటుకుందని విమర్శించారు.

బీసీలకు ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా కేంద్రం, కోర్టులపై నెపం మోపడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కేంద్రం, కోర్టుల వైఖరి ముందుగానే తెలియదా ? తెలిసి కూడా హామీలు ఎందుకు ఇచ్చారు ? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వమే తెచ్చిన కులగణన నివేదికను సరిగా వినియోగించుకోకుండా, ఈ కుట్రలను సమన్వయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న వారి మద్దతుదారులు ప్రజల తిరుగుబాటు రాకముందే తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పర్వతనేని సతీష్ అధ్యక్షత వహించిన‌ ఈ మ‌హాధ‌ర్నాలో బిసి జేఏసి వ‌ర్కింగ్ చైర్మ‌న్ గుజ్జ కృష్ణ‌, నాగుల శ్రీనివాస్ యాదవ్, నాగు నరేష్, సీనియర్ ఉద్యమ నాయకుడు సంతోష్ తదితరులు సమన్వయం చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page