ఏషియన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద అన్నదానం

ముషీరాబాద్, సెప్టెంబర్ 02, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రుల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం ఏషియన్ యూత్ అసోసియేషన్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అతినగరం సుదేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం అనిల్, జయేందర్ బాబు, గోవింద్, మేడి సురేష్, జగదీష్ బాబు, స్వామి, నారాయణ మూర్తి, నరేందర్, మీసాల జయ కుమార్, సాయి తదితరులు హాజరయ్యారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply