పైప్‌లైన్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, మార్చి 11, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని మళ్యాయం చర్చీ రోడ్డు, అశోక్‌నగర్ ప్రాంతాల్లో రూ.12 లక్షల నిధులతో ప్రారంభమైన నూతన మంచినీటి పైప్‌లైన్ పనులను బుధవారం వాటర్ వర్క్స్ డిజిఎం వెంకట్ రెడ్డి, మేనేజర్ శివకుమార్, వర్క్స్ ఇన్స్పెక్టర్ శంకర్, బిజెపి నేతలతో కలిసి మాజీ కార్పొరేటర్ పావని పరిశీలించారు. మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించే దిశగా చేపట్టిన నూతన పైప్‌లైన్ పనుల్లో నాణ్యతను పాటించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆమె కోరారు. మెరుగైన మంచినీటి సరఫరాను డివిజన్ ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో పనులు కొనసాగుతున్నాయని మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, గాంధీనగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, విష్ణు ప్రసాద్, ఎం.ఉమేష్, శ్రీనివాస్ యాదవ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply