స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ రాంనగర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసం వద్ద 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను దత్తాత్రేయ ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మీ, బిజెపి నాయకులు రొయ్యూరు శేషసాయి, నేతి రాజేశ్వర్‌రావు, అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి కృష్ణ యాదవ్, నాయకులు గణేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.













Leave a Reply