ముషీరాబాద్‌లో ఘ‌నంగా మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జ‌యంతి వేడుక‌లు

 

ముషీరాబాద్‌లో ఘ‌నంగా మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి జ‌యంతి వేడుక‌లు

 

హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ :    తొలిద‌శ‌, మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి 85వ జ‌యంతి వేడుక‌లు సోమ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వాడ‌వాడ‌లా ఘ‌నంగా జ‌రిగాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని రాంన‌గ‌ర్ డివిజ‌న్ బాగ్‌లింగంప‌ల్లి లంబాడితండా బ‌స్తీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్, నాయిని న‌ర్సింహారెడ్డి ఫౌండేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి హాజ‌రై నాయిని విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్ర రాజ‌కీయాల్లో కార్మిక నాయ‌కుడిగా నాయిని న‌ర్సింహారెడ్డి ఎంతో పేరుప్ర‌ఖ్యాతుల‌ను తెచ్చుకున్నార‌న్నారు. తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించి, రాష్ట్ర తొలి హోంమంత్రిగా ప‌ని చేశార‌న్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయంగా, కార్మిక నాయ‌కుడిగా ఉక్కుమ‌నిషిగా ముద్ర‌ను వేసుకున్న ఘ‌న‌త నాయిని న‌ర్సింహారెడ్డికే ద‌క్క‌తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయిని న‌ర్సింహారెడ్డి ఫౌండేష‌న్ ఉపాధ్య‌క్షుడు నాయిని దేవేంద‌ర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు సిరిగిరి కిర‌ణ్‌, రేషం మ‌ల్లేష్, సిరిగిరి శ్యామ్‌, క‌ల్వ‌గోపి, ప‌ర‌కాల ర‌జినికాంత్‌గౌడ్, వెంకటేష్‌, రాజేష్‌, సోను, శివ‌, మ‌ధు, అమిత్‌, ఇయాజ్‌, జాన్‌, సాల‌మ్మ‌, క‌ల్ప‌న‌, రేఖ‌, మేరి, రేణుక‌, తిరుమ‌ల‌, అనురాధ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page