కవాడిగూడ, నవంబర్ 21, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడలోని జ్యోతినగర్ కమ్యూనిటీహాల్‌లో శనివారం అప్స, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం.శ్రీనివాస్ ఒంటినొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజ్‌లను చూపించారు. డాక్టర్ శివ కుమార్, డాక్టర్ జయ దంత పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నర్సింహ మూర్తి, అప్స సంస్థ ప్రొగ్రామ్ మేనేజర్ ఎం.బస్వరాజ్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బొట్టు రమేష్, జి.మంజుల, రాజేశ్వరి, సిబ్బంది, ఒమేగా హెల్త్ కేర్ వాలంటీర్‌లు, జనహిత క్యాంపు కో-ఆర్డినేటర్ బి.నర్సింగ్ రావు, కిమ్స్ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ జె.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
జ్యోతినగర్‌లో ఉచిత వైద్య శిబిరం
RELATED ARTICLES








