హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ఇటీవల అనారోగ్యం నుండి కోలుకొని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గాంధీనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మను స్థానిక డివిజన్ ప్రస్తుత కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవలందించాలని కోరారు. ముఠా పద్మను పరామర్శించిన వారిలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు జి.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply