అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ : ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా మూడవరోజు ( మంగళవారం ) గాంధీనగర్ డివిజన్లోని టిఆర్టి కాలనీలో శ్రీ వారాల పోచమ్మ తల్లి దేవాలయం, సిద్ధంషెట్టి అపార్ట్మెంట్లోని శ్రీ బంగారు పోచమ్మ ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ దంపతులు హాజరై అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, సురేష్, సాయి చంద్, ఆకుల సురేందర్, హన్మంతు, ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యులు, అన్నదాన నిర్వాహకులు కనకరాజు, శ్రీ రామ్, యేసు రత్నం, భూమయ్య, కుమార్, జితేందర్ రెడ్డి, జయ కృష్ణ, కెప్టెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
