తార్నాక, సెప్టెంబర్ 26, ( అద్దం న్యూస్ ) : తార్నాక గోకుల్‌నగర్‌లోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలం పాటలో స్థానికుడు వెంకటేష్ మడివార్ పోటీపడి రూ.75 వేలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. గణనాథుని దివ్య ప్రసాదమైన లడ్డూను దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెంకటేష్ మడివార్ తెలిపారు. వేలం సందర్భంగా మండపం వద్ద భక్తులతో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బండ చంద్రారెడ్డి, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు స్థానిక నాయకులు శ్రీనివాస్, లడ్డు, రాజు, సురేష్, సతీష్ గౌడ్, వెంకటేష్, నవీన్, రాజు, మల్లేష్, న్యాయం రెడ్డి, శ్రీకాంత్, భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేలం పాటను విజయవంతం చేశారు.
గోకుల్‌నగర్‌లో రూ.75 వేలకు గణేష్ లడ్డూ వేలం
RELATED ARTICLES

