నారాయణగూడ, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : గణపతి నిమజ్జనానికి తరలివచ్చిన భక్తుల దాహార్తి తీర్చేందుకు చేతన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణగూడలో 20 వేల మంచినీటి బాటిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మంచినీటి బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు మాట్లాడుతూ… వినాయక చవితి హిందూ ధర్మంలో విశిష్టమైన పండుగ అని, ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేయడం మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమన్నారు. వినాయక ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీరు అందించడం అభినందనీయమైన సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ జనరల్ సెక్రటరీ వెంకట్ స్వామి, సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, నర్సింగ్ ముదిరాజ్, అభిషేక్ యాదవ్, నాడు అర్జున్, నవీన్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రంజిత్, శ్రీనివాస్, వేణు, తుల్జా, కవిత, మాధవి, వాణి, సరిత, మనీలా, శకుంతల, శ్రీశైలం, రాజు, రమేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిమజ్జన భక్తులకు మంచినీటి పంపిణీ
RELATED ARTICLES

