Saturday, September 26, 2026
No menu items!
Homedevotionalవినాయక నిమజ్జనానికి విచ్చేసిన ప్రజలకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ

వినాయక నిమజ్జనానికి విచ్చేసిన ప్రజలకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి పంపిణీ

📰 Generate e-Paper Clip

హిమాయ‌త్‌న‌గ‌ర్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) :    వినాయక నిమజ్జన కార్యక్రమానికి నారాయణగూడకు విచ్చేస్తున్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నారాయ‌ణ‌గూడ‌లో ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె.అశోక్ రెడ్డి మాట్లాడుతూ… నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు, ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందించారు. ప్రజలకు సేవ చేయడం, సామాజిక బాధ్యతను నిర్వర్తించడం తమ కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. “ దాహం తీర్చుదాం… మానవత్వం చాటుదాం ” అనే సందేశంతో ప్రజలకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలు ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రజనీకాంత్, సహాయ కార్యదర్శి ఆంజనేయులు, ప్రవీణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page