గణేశ్ ఉత్సవం, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి – సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య

గణేశ్ ఉత్సవం, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి

– సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య

హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :    వినాయ‌క‌చ‌వితి, మీలాద్-ఉన్-నబీ పండుగలను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలని సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.మ‌ట్ట‌య్య అన్నారు. సోమ‌వారం సుల్తాన్‌బజార్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మ‌ట్ట‌య్య ఆధ్వర్యంలో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్, నారాయణగూడ పోలీస్ స్టేషన్, సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌ల పీస్ కమిటీ సభ్యులతో పరిచయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే గణేశ్ ఉత్సవం, మీలాద్-ఉన్-నబీ పండుగల సందర్భంగా సమన్వయం, శాంతి భద్రతా ఏర్పాట్ల పై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఏసిపి మ‌ట్ట‌య్య మాట్లాడుతూ… పండుగ‌ల‌ను ప్ర‌శాంతంగా జ‌రిగే విధంగా చూసేందుకు పోలీసు, పీస్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజల మధ్య సమన్వయంతో ప‌ని చేయాల‌న్నారు. పండుగల సమయంలో లా అండ్ ఆర్డ‌ర్ స‌రిగ్గా అమ‌లు కోసం ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పండుగ‌ల స‌మ‌యంలో ట్రాఫిక్, జనసంచారం నియంత్రణ చేస్తామ‌న్నారు. పండుగ‌ల్లో ఎలాంటి అపశృతి జ‌రుగ‌కుండా విజయవంతంగా జరగాలన్న దానిపై దృష్టి సారించామ‌న్నారు. ఈ స‌మావేశంలో సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్య‌క్షుడు ఎస్.నారాయణ రెడ్డి, ఈస్ట్ జోన్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ శరత్ శ్యామ్‌, ఈస్ట్ జోన్ ఉపాధ్య‌క్షుడు సయ్యద్ ఫరీదుద్దీన్ యూనుస్, పీస్ క‌మిటీ స‌భ్యులు మ‌ధుసూద సొమాని, ఈస్ట్ జోన్ క‌న్వీన‌ర్ స‌య్య‌ద్ ఖాలేద్ షా, ఆర్గనైజింగ్ సెక్రటరీ బసంతి కౌర్, ప్రొగ్రామ్ కో–ఆర్డినేట‌ర్ ఎల్.శ్రీలత త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page