హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో గత కొన్ని రోజులుగా వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలు, ఫీడర్ల పై ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను ఎలక్ట్రికల్ సిబ్బంది తొలగించారు. అయితే ఆ తొలగించిన చెట్ల కొమ్మలను అక్కడికక్కడే రోడ్లపైనే కుప్పలుగా వేశారు. దీంతో అవి పేరుకుపోయాయి. దీంతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కార్పొరేటర్ పావని జిహెచ్ఎంసి కమిషనర్‌తో సమీక్షించి, చెట్ల కొమ్మలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి సిబ్బంది ఆదివారం గాంధీనగర్ డివిజన్‌లో చిక్కడపల్లి, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్ల పై పేరుకుపోయి ఉన్న చెట్ల కొమ్మలను స్పెషల్ డ్రైవ్ కింద వెహికిల్స్‌ను తెప్పించి తొలగించారు. కార్పొరేటర్ పావని సూచనల మేరకు చెట్ల కొమ్మల తొలగింపు పనులను బిజెపి సికింద్రాబాద్ జాయింట్ కన్వనర్ వినయ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌రావు, నాయకుడు జ్ఞానేశ్వర్ తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply