దళితులకు ఉన్నత విద్యా అందించడం సర్కార్ లక్ష్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

దళితులకు ఉన్నత విద్యా అందించడం సర్కార్ లక్ష్యం
» త్వరలో అంబేద్కర్ టవర్
» ఎస్సీ విద్యార్థులకు అత్యుత్తమ సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2 కోచింగ్ అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత
» రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 26, అద్దం న్యూస్ :   ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాను అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. గురువారం హైద‌రాబాద్ లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌ను, కాచిగూడ హాస్ట‌ల్ కాంప్లెక్స్‌ను 59 దళిత కులాల సంఘాల నాయకులతో క‌లిసి మంత్రి సంద‌ర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. త్వరలో అంబేద్కర్ టవర్ ను నిర్మిస్తామ‌న్నారు.

కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సివిల్స్ కోచింగ్ కోరకు తెలంగాణ విద్యార్ధులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందని మంత్రి తెలిపారు. దళిత విద్యార్ధులు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడం ఖర్చుతో కూడిన పని కావడంతో ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్ధుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చర్స్ తీసుకోవడంతో పాటు మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని మంత్రి తెలిపారు. కోచింగ్ తీసుకునే అభ్యర్ధుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా  ( పరిపాలకుడి గా ) తీర్చిద్దిదాలనే అనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. సివిల్స్‌, గ్రూఫ్–1, గ్రూఫ్–2 కోచింగ్ కోసం మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండ తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు డి.సుదర్శన్ బాబు, మేడి పాపయ్య, ఇటుక రాజు, కృష్ణవేణి, స్థాలిన్, దాసరి యాదగిరి, నవీన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page