హైదరాబాద్, మే 26, అద్దం న్యూస్ : ప్రభుత్వం కాలేశ్వరం సరస్వతీ నది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆడంబరాలకు పోయి, పుష్కరాలకు వచ్చిన ప్రజల్ని పట్టించుకున్న పాపనపోలేదని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. సోమవారం దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… పుష్కరాలకు విచ్చేసిన భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టెంకాయకు వంద రూపాయలు, దర్శనానికి వంద రూపాయల చొప్పున వసూలు చేసే పరిస్థితికి తయారై ప్రజలను ఇక్కట్లు పాలు చేసిందన్నారు. పోలీస్ యంత్రాంగం యావత్తు అధికార పార్టీ అడుగులకు మడుగులేస్తూ దర్శనాలు చేయించడంలో పుష్కర స్నానాలు చేయించడంలో మునిగిపోయి.. నిమగ్నమైపోయి ప్రభు భక్తి చాటుకున్నారని విమర్శించారు. ఎంతో ఆడంబరంగా సుమారు 200 కోట్ల ప్రజాధనంతో నిర్వహించిన అందాల పోటీల్లో అధ్వానంగా తయారై ప్రభుత్వం అబాసు పాలయ్యిందని ధ్వజమెత్తారు. తెలంగాణ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని. ఈ విధంగా చిత్తశుద్ధి లేని ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితమేముందని ప్రశ్నించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల తెలంగాణ పరువు పోవడం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. పుష్కరాలు సామాన్యుడికి అందరి ద్రాక్ష పండు అనే మిగిలిపోయాయని అన్నారు. పుష్కర ఘాటుకు పది కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ తో ఆగిపోయాయని, అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకొని. ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ్ ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, టిడిపి నాయకులు ఎస్.ప్రకాష్, కిరణ్, బాను ప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply