ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య

ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య



హైదరాబాద్, ఆగ‌స్టు 03, అద్దం న్యూస్ :    ప్రభుత్వ భూములను అమ్మకూడదు ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్ల‌పల్లి అంజి అధ్యక్షతన విద్యార్థులతో కలిసి ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్‌.క్రిష్ణ‌య్య హాజరై మాట్లాడుతూ… ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మాలని చూస్తుందన్నారు. దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. హాస్టళ్ళ నిర్వహణలో ప్రభుత్వం నిర్ల‌క్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదని.. ఇది బీసీ కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇప్పుడు గచ్చిబౌలి స్థలాలు అమ్ముతారని… విద్యార్థులు ఇలాగే నిశ్శబ్దం ఉంటే భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీలో 800 ఎకరాలు ఇతర భూములు అమ్ముతారన్నారు. అందుకే విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగే పార్లమెంట్‌లో చర్చ లేపుతామని అన్నారు. అద్దె భవనాల బకాయిలు కూడా మూడు సంవత్సరాలుగా చెల్లించడం లేదన్నారు.                    ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్‌కు నిర్మాణానికి ఉపయోగించాలని, అంతే గాని అమ్మడానికి కాదన్నారు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉంటుందని ప్ర‌శ్నించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారని.. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాన్ని ఆపేశార‌న్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి అమ్మడం ఆపేయాలన్నారు. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు బస్ పాస్, ఇతర చిల్లర ఖర్చులకు ప్రతి ఒక్కరికి నెలకు బాలికలకు 1000 బాలురకు, రూ.800 పాకెట్ మని మంజూరు చేయాల‌న్నారు. ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ, ఫార్మసీ, పిటి, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాల‌న్నారు. ఈ కోర్సుల ఫీజుల గరిష్ట పరిమితి ఎత్తివేసి, గతంలో మాదిరిగా పూర్తి ఫీజులు ఇవ్వాల‌న్నారు. అదనంగా ఇంకా 150 బిసి కాలేజి హాస్టళ్ళు 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పగిళ్ల సతీష్, అనంతయ్య, రాజేందర్, నందగోపాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page