ప్రభుత్వం ఉద్యోగాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి
– జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్
కాచిగూడ, ఆగస్టు 31, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలోని నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలపై సీఎం రేవంత్‌రెడ్డి శ్వేత పత్రాన్ని విడుదల చేసి, నిజాయితిని నిరుపించుకోవాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు. కాచిగూడ నింబోలిఅడ్డాలో రాష్ట్ర నాయకులతో కలిసి రాజేందర్ పటేల్ గౌడ్ మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడొద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. నిరుద్యోగులకు యేడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, దానికితోడు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల శాశ్వతంగా విద్యను దూరం చేయడం కోసమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ యాజమాన్యాలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, భూషన్ భాస్కర్, ముత్యాలరావు, ప్రశాంత్ నిమ్కర్, సత్య పాల్సింగ్, ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply