ఘ‌నంగా రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు
రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

హైద‌రాబాద్‌, జూన్ 15, ( అద్దం న్యూస్ ) :   మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కుడు, రాంన‌గ‌ర్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, జంట‌న‌గ‌రాల మేద‌రి సంఘం అధ్య‌క్షుడు రేషం మ‌ల్లేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. రాంన‌గ‌ర్ డివిజ‌న్ ద‌యారామార్కెట్ చౌర‌స్తా వ‌ద్ద గ‌ల ఓ ఫంక్ష‌న్‌హాల్‌లో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్ రెడ్డి లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు రేషం మ‌ల్లేష్‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి.. ఆయ‌న‌ను స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లేష్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో మల్లేష్ ఎంతో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. దివంగత మాజీ హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి చేసిన అన్ని ఉద్యమాల్లో మల్లేష్ పాత్ర కీలకంగా ఉండేవార‌ని చెప్పారు.

ఐదు సార్లు డివిజన్ అధ్యక్షుడిగా ప‌ని చేసి.. పార్టీకి ఎంతో సేవ చేశార‌న్నారు. రేషం మ‌ల్లేష్‌ సేవలను పార్టీ గుర్తిస్తుందని, రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయనకు న్యాయం జరిగేలా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… మల్లేష్ చేసిన సేవలను పార్టీ మరవదని చెప్పారు. ఉద్య‌మం స‌మ‌యంలో రాంన‌గ‌ర్ చౌర‌స్తాలో అమ‌ర‌వీరుల స్థూపాన్ని మ‌ల్లేష్ ఏర్పాటు చేశార‌న్నారు. క‌రోనా స‌మ‌యంలో కూడా అనే సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టార‌న్నారు. రేషం మల్లేష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, డివిజన్ అధ్యక్షుడిగా పార్టీని బూత్ స్థాయిలోకి తీసుకెళ్ల‌డంలో కీల‌కంగా ప‌ని చేశాన‌న్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో త‌న‌కు పార్టీ న్యాయం చేయాలని కోరారు. ఈ వేడుక‌ల్లో తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, క‌ల్వ‌గోపి, అజ‌య్ ముదిరాజ్‌, పెంటారెడ్డి, బిక్ష‌ప‌తి యాద‌వ్‌, ఇంధ్ర‌సేనారెడ్డి, జుగేంద‌ర్‌, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, గోక నవీన్, ఎయిర్‌టెల్ రాజు, రాజు గౌడ్‌, క‌ల్ప‌న‌, రేఖ‌, శ్రావ‌ణ్‌, అమిత్‌, స‌త్య‌నారాయ‌ణ‌, న‌ర్సింగ్‌రావు, సోను, కాంగ్రెస్‌, బిజెపి పార్టీల నాయ‌కులు న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి, రావ‌ర్తి జ‌నార్థ‌న్‌, క‌ల‌కోట అరుణ్‌, ఎజాజ్ హుస్సేన్‌, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page