హైదరాబాద్, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) : కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, తెలంగాణ జన సమితి, సిపిఐ ( ఎంఎల్ ) న్యూడ్ డెమోక్రసీ, మాస్ లైన్ తదితర పార్టీల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు లకిడాకాపూల్లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యుడు కోదండరాం హాజరై మాట్లాడుతూ… ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిపోయి అధికార పక్షానికి తొత్తులుగా మారారని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నరసయ్య, జన సమితి నాయకులు బైరి రమేష్, సలీం పాషా, అరుణ్ కుమార్, బట్టల రామచందర్, జశ్వంత్ కుమార్, రమేష్ ముదిరాజ్, హనుమంత రెడ్డి, జి.మధు, వినోద్ కుమార్, జైపాల్ రెడ్డి, లక్ష్మణ్, సయ్యద్ ఇస్మాయిల్, సయ్యద్ అబ్రా, రసూల్ సదానంద్, నరేందర్, శంకర్, రవీందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి –అఖిలపక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
RELATED ARTICLES
