Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నూతన షెడ్డుపై హెచ్‌టి కేబుల్ క్రమబద్ధీకరణ

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నూతన షెడ్డుపై హెచ్‌టి కేబుల్ క్రమబద్ధీకరణ

📰 Generate e-Paper Clip

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నూతన షెడ్డుపై హెచ్‌టి కేబుల్ క్రమబద్ధీకరణ


ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఆర్టీసి క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం వ‌ద్ద నిర్మిస్తున్న నూత‌న షెడ్డు పై ప్ర‌మాద‌క‌రంగా ఉన్న హై టెన్ష‌న్ విద్యుత్ కేబుల్‌ను తొల‌గించాల‌ని ఆల‌య క‌మిటీ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ స్పందించారు. టిఎస్‌పిడిఎస్ఎల్ డివిజ‌నల్ ఇంజినీర్ నెహ్రూ నాయ‌క్‌తో మాట్లాడిన కార్పొరేట‌ర్ పావ‌ని నూత‌నంగా నిర్మించే షెడ్డు పై ఉన్న హెచ్‌టి విద్యుత్ కేబుల్ ను స‌రి చేయాల‌ని కోరారు. కార్పొరేట‌ర్ పావ‌ని సూచ‌న‌ల మేర‌కు సోమ‌వారం సంబంధిత అధికారులతో క‌లిసి బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ ఎ.విన‌య్ కుమార్ హెచ్‌టి విద్యుత్ కేబుల్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యుత్ శాఖ అడిష‌న‌ల్ డివిజ‌న‌ల్ ఇంజినీర్లు సంప‌త్‌, డిఈ వినోద్‌, గాంధీన‌గ‌ర్ ఏఈ సంతోష్, సిబ్బంది, బిజెపి డివిజ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, ఆల‌య క‌మిటీ స‌భ్యులు న‌వీన్‌, భానుచంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page