హ్యూమన్ రైట్స్ సభ్యులు నీతి, నిజాయితీ, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి
– సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల
హైదరాబాద్, ఆగస్టు 16, అద్దం న్యూస్ : హ్యూమన్ రైట్స్ సభ్యులు నీతి, నిజాయితీ, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల అన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని శ్రీ సాయి బ్యూటి సెంటర్‌లో శనివారం ఐడి కార్డులు, సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు పూర్వపు జడ్జి, అడ్వకేట్ మల్యాద్రి నేరెళ్ల హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ నీలా శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ గుప్త, ప్రధాన కార్యదర్శి కల్వ వీరేందర్, ఉపాధ్యక్షురాలు సరాఫ్ తులసి గుప్తా, కోశాధికారి సరాఫ్ రజనీష్, శ్రీకాంత్ గుప్తా, అడ్వకేట్, సినీ నటుడు నరసింహారావు, మద్దూరు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి నేరెళ్ల మాట్లాడుతూ… హ్యూమన్ రైట్స్ సంస్థ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, నీతి, నిజాయితీ, విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నవ్వుతూ నవ్విస్తూ అందరిని ప్రేమపూర్వకంగా ఉంచేలా చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సరాఫ్ తులసి గుప్తాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఘనంగా సత్కరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply