Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadHyderabad: ఆలస్యంగా రైళ్లు.. ప్రయాణికుల జేబుకు చిల్లులు

Hyderabad: ఆలస్యంగా రైళ్లు.. ప్రయాణికుల జేబుకు చిల్లులు

📰 Generate e-Paper Clip

Hyderabad: ఆలస్యంగా రైళ్లు.. ప్రయాణికుల జేబుకు చిల్లులు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఉప్పల్‌కు చెందిన నాగరాజు తిరుపతి వెళ్లేందుకు చర్లపల్లి నుంచి టికెట్‌ బుక్‌ చేశారు. ఉప్పల్‌ నుంచి చర్లపల్లికి నేరుగా బస్సులు లేకపోవడంతో హబ్సిగూడ వరకు వచ్చి అక్కడి నుంచి స్టేషన్‌కు వెళ్లే బస్సు కోసం గంటల తరబడి వేచి ఎదురుచూశారు. ఒక్క బస్సు రాకపోయేసరికి క్యాబ్‌ బుక్‌ చేయగా పలుమార్లు రద్దయ్యింది. పక్కనే ఉన్న ఆటోవాలాను అడిగితే రూ.500 డిమాండ్‌ చేశారు. రైలొచ్చే సమయం దగ్గరపడుతుండటంతో చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చేసి స్టేషన్‌ చేరుకున్నాడు. ఇతనొక్కరే కాదు సంక్రాంతికి సొంతూరికి పయనమవుతున్న ప్రయాణికుల పరిస్థితి ఇదే. సరైన సమయానికి బస్సులు లేవంటూ ప్రయాణికులు ఆరోపిస్తుంటే.. లేదు లేదు రైళ్లే ఆలస్యంగా నడుస్తుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కానీ అంతిమంగా ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page