ఆ పనులకు నిధులను నేనే మంజూరు చేయించా
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, జనవరి 19, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులకు నిధులను నేనే మంజూరు చేయించానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో రూ.22.75 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రైనేజి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… పఠాన్‌బస్తీలో ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య ఉందని, దాని ద్వారా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం సంబంధిత అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తులు చేసి, నిధులను మంజూరు చేయించామన్నారు. కానీ కొన్ని పార్టీల నాయకులు తామే నిధులను తెప్పించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా విడ్డూరంగా ఉందని విమర్శించారు. నియోజకవర్గంలో డ్రైనేజి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం మోహన్ రాజ్, అధికారులు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, బీఆర్‌ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జావీద్ ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, మహ్మద్ ఇబ్రహీం, పులిగిల్ల శ్రీధర్ చారి, బిఆర్ఎస్ మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, మహబూబ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ సర్వర్, దీన్ దయాల్‌రెడ్డి, బల్ల ప్రశాంత్, శ్రీకాంత్ యాదవ్, శంకర్, రాకేష్, శ్యామ్, బియ్యం శ్రీను, చింటు, వంగల నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాదవ్, నాయకులు పట్నం నాగభూషణం గౌడ్, జిఎన్ చారి, రామకృష్ణ, బిజెపి నాయకులు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
పోటా పోటీగా నినాదాలు :
ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో సోమవారం డ్రైనేజీ పైప్‌లైన్ పనుల ప్రారంభోత్సవంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజేపి పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. నిధులను మేము తెచ్చామంటే మేము తెచ్చామని గత వారం క్రితమే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఫొటోలకు ఫోజులిచ్చారు. తాజాగా సోమవారం పైప్‌లైన్ల పనుల శంకుస్థాపనలో మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు ఫొటోలు దిగేందుకు తోపులాటకు దిగారు. అదే సమయంలో జై బిఆర్ఎస్… జై కాంగ్రెస్ … జై బిజెపి అని నినాదాలు చేసుకున్నారు.![]()

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply