పాకిస్థాన్ ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పిన భారత సైనిక బలగాలు
– బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

బాణాసంచాలను కాల్చుతున్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : పాకిస్థాన్ ఉగ్రవాదులకు భారత సైనిక బలగాలు సరైన బుద్ధి చెప్పారని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. కాశ్మీర్ లోనీ పహాల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు అమరులైన భారతీయుల మరణాలకు ప్రతీకగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత సైనిక బలగాలు మంగళవారం అర్థరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని 9 ఉగ్రమూకల స్థావరాలపై బాంబుల దాడితో విరుచుకు పడి సుమారు 100కు పైగా లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మోడి సంపూర్ణ మద్దత్తుతో సైనిక దళాల సాహసోపిత చర్యలకు దేశ వ్యాప్తంగా భారతీయులు నీరాజనం పలుకుతున్నారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా వద్ద బాణాసంచాలను కాల్చి, స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ బాణాసంచాలను కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాకిస్థాన్ లోకి చొరబడి ఉగ్రవాదులను ఆపరేషన్ సిందూర్ ద్వారా మట్టుబెట్టిన భారత సైనిక బలగాలకు, అందుకు మద్దతుగా నిలిచిన నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం మొదలు మాత్రమే అని చివరిదశ ఎవరు ఊహించని విధంగా ఉంటుందని, మరోసారి ముష్కరులు భారత్ వైపు చూసేందుకు కూడా భయపడే విధంగా పాకిస్థాన్ పై యుద్ధ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, రాజు, ఎం.ఉమేష్, ప్రకాష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, మదన్మోహన్, సాయి కుమార్, దోనేటీ సత్యం, సత్యేంధర్, కుమార్, ధనరాజ్, జ్ఞానేశ్వర్, రఘు యాదవ్, సాయి కృష్ణ యాదవ్, నీరజ్ ప్రశాంత్, రాహుల్, భాను, కృష్ణ వేణి, సంయుక్త రాణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply