బోనాల జాతరకు రావాలని కెటిఆర్‌కు ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో ఈ నెల 9వ తేదీన బోనాలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో 10 వ తేదీన జరుగనున్న బోనాలు, పోతరాజుల ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగనుంది. ఈ ఊరేగింపునకు రావాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు రేషం మల్లేష్ ఆహ్వాన పత్రికను అందచేశారు. బోనాల జాతరకు వచ్చి కార్యకర్తలను ఉత్తేజపర్చాలని కెటిఆర్‌ను మల్లేష్ కోరారు. కెటిఆర్‌ను కలిసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, అజయ్ ముదిరాజ్, కల్వగోపి, బల్లెకరి రమేష్, మధు, రేషం మణికంఠ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply