తెలంగాణ ఉద్యమకారుల సేవలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత

తెలంగాణ ఉద్యమకారుల సేవలను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత
– మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ 

 హైదరాబాద్,  జూన్ 3, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడి, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించడం ఆనందదాయకమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,  అన్నారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన అనేది లక్షలాది మంది ప్రజల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగ సంఘాల కృషి, కళాకారుల చైతన్యం, మేధావుల మార్గదర్శకత్వం మరియు ఉద్యమకారుల అంకితభావం ఫలితమని తెలిపారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కీలక పాత్ర పోషించిందని, ఉద్యమ శక్తులన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు నడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయ లక్ష్మి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, ఎమ్మెల్సీ కోదండరాం, ఎంపి.కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీహెచ్ విఠల్, ప్రొఫెసర్ వెంకట నారాయణ, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page