సికింద్రాబాద్, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :
భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యుడిగా ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్‌కు చెందిన కె.జగదీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జగదీష్‌కు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ నియామకపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ… సికింద్రాబాద్ మహంకాళి జిల్లా పరిధిలో బిజెపి బలోపేతం చేస్తామన్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. తన పై నమ్మకంతో తనను బిజెపి మహంకాళి జిల్లా కార్యవర్గసభ్యుడిగా నియమించినందుకుగాను రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ కు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ సందర్భంగా జగదీష్‌కు పలువురు నేతలు సన్మానాలు చేశారు. బిజెపి రాష్ట్ర నాయకుడు రొయ్యూరు శేషసాయి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.![]()
