Friday, September 18, 2026
HomeHyderabadఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి – తెలంగాణ జర్నలిస్టుల...

ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి – తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

న‌కిరేక‌ల్ బ్యూరో, అద్దం న్యూస్ : ఉద్యమంలో పాల్గొని వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ నెల 13వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో తెలంగాణ జ‌ర్న‌లిస్టు ఫ్రంట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న జ‌ర్న‌లిస్టుల స‌మ్మేళ‌నానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం న‌కిరేక‌ల్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బైరాగి, డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు వేముల యాదగిరి, టియు జేఏసీ నాయకులు రమేష్ మాట్లాడుతూ… ప్రింటు, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల పరిస్థితి నేడు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు, ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో, డెస్క్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం కార్యక్రమానికి ఫోటో, వీడియో,ప్రింట్, ఎలక్ట్రానిక్, మీడియా జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని విజయం చేయాలని. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక సంఘం నాయకులు బాబన్న, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కొమ్ము శంకర్, ఎద్దు వెంకన్న, ఎద్దు రవి, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page