జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బిఆర్ఎస్‌కు జంట న‌గ‌రాల మ‌హేంద్ర సంఘం మ‌ద్ద‌తు

Twin Cities Mahindra Sangam supports BRS in Jubilee Hills by-election

హైదరాబాద్, న‌వంబ‌ర్ 7, అద్దం న్యూస్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బిఆర్ఎస్ పార్టీకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జంట న‌గ‌రాల మ‌హేంద్ర సంఘం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం జంట నగరాల మహేంద్ర సంఘం అధ్యక్షుడు రేషం మల్లేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్‌ను, జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడు, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ వి.శ్రీనివాస్‌రెడ్డిల‌ను సంఘం నాయ‌కులు క‌లిసి మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.

జంట నగరాల మహేంద్ర సంఘం అధ్యక్షుడు రేషం మల్లేష్ మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో బిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సునిత గెలుపు కోసం జంట న‌గ‌రాల మ‌హేంద్ర సంఘం ఆధ్వ‌ర్యంలో కృషి చేస్తామ‌న్నారు. కెటిఆర్‌ను క‌లిసిన వారిలో జంట న‌గ‌రాల మ‌హేంద్ర సంఘం నాయ‌కులు గురుమూర్తి, రామ్ కుమార్, నర్సింగ్ రావు, సతీష్, ప్రసాద్, ఆర్.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page