Sunday, September 20, 2026
No menu items!
HomeTelanganaఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా...

ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా…

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉద్యమ నేత, ప్రజా నాయకుడు, గౌరవనీయులు అయిన కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆక్షేపణీయం అని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

మానవత్వంలేని ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని కవిత హితవు పలికారు. ఇటువంటి దుశ్చర్యను తెలంగాణ సమాజం గమనిస్తోందని, సమయం వచ్చినప్పుడు మీకు ఇంతకింత శాస్తి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను కూడా కవిత పంచుకున్నారు.

స్టేచర్ ఉందని విర్రవీగితే మిమ్మల్ని స్ట్రెచర్ మీదికి చేర్చారు… మీరు ఇంకా మార్చుకోకపోతే మార్చురీకి పోతారు అంటూ రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్ కూడా స్పందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page