సుందరకాండ పంచలోహ విగ్రహాల తొడుగు కోసం కేజి వెండి విరాళం
హైదరాబాద్, డిసెంబర్ 2, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సుందరకాండ పంచలోహ విగ్రహాల తొడుగు కోసం హరీష్ అనే భక్తుడు ఒక కేజి వెండిని విరాళంగా అందచేశారు. మంగళవారం ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ జానకి సుధాకర్ కు వెండిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు గంగం రవి తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply