Friday, September 18, 2026
Homedevotionalబోనాల జాత‌ర‌ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయండి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

బోనాల జాత‌ర‌ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయండి – కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

బోనాల జాత‌ర‌ను స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయండి

– కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్



హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ :   ఆషాఢ మాసం బోనాల జాతర పండుగను అన్ని శాఖ‌ల అధికారులు స‌మిష్టిగా విజ‌య‌వంతం చేయాల‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. ఈ నెల 20వ తేదీన జ‌రుగ‌నున్న బోనాల జాత‌రను పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం జిహెచ్ఎంసి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, జలమండలి, ఎలక్ట్రికల్ త‌దిత‌ర‌ ప్రభుత్వ శాఖల అధికారులతో కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… బోనాల పండగ ఏర్పాట్లకు అధికారులు సమన్వయంతో సహక‌రించాలని కోరారు. పోలీసు శాఖ వారు భక్తుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా ట్రాఫిక్ అంతరాయం నిర్మూలించే విధంగా అన్ని ముఖ్యమైన దేవాలయాల వద్ద బారికేడ్లను, బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు. దేవాయల వద్ధ వ్యర్థాలు తొలగించేందుకు జిహెచ్ఎంసి సిబ్బంది కవర్లను అందచేసి ఎప్పటికపుడు పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేపట్టాలని సూచించారు. అమ్మవార్ల దేవాలయాల వద్ద అంధకారం లేకుండా విద్యుత్‌ దీపాల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ సిబ్బంది, మంచినీటి సౌకర్యంలో లోటు పాట్లు లేకుండా జలమండలి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ పావ‌ని ఆదేశించారు. ఈ సమావేశంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రామానుంజన్ రెడ్డి, ఏఎంహెచ్ఓ డాక్ట‌ర్‌.ప్రవీణ, వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణ మోహన్, చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ల‌ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్లు కరీమ్, జి.దుర్గ, వారి సిబ్బంది బీజేపీ డివిజన్ అద్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, సాయి కుమార్, ప్రశాంత్, ఆలయ కమిటీ సభ్యులు సాయి కీర్త్, శివ ప్రసాద్, శ్రీధ‌ర్‌, శివ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page