కాచిగూడ, ఏప్రిల్ 22, ( అద్దం న్యూస్ ) : ప్రమాదాలు నివారించడం కేవలం లోకో పైలట్లకే సాధ్యమని, రైల్వే సంస్థకు లోకో పైలట్లే వెన్నెముక అని హైదరాబాద్ డివిజన్ రైల్వే డిఆర్ఎం లోకేష్ విష్ణవ్ అన్నారు. రైల్వే లోకో పైలట్ల కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ పార్సల్ కార్యాలయం పక్కన ఏసీ గదులతో కూడిన 24 బెడ్లను మంగళవారం డిఆర్ఎం, రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ.. లోకో పైలట్లు సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినప్పుడే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రైల్వే సంస్థ పురోగతి, మరింతగా లాభాల బాటలో పయనించాలంటే లోకో పైలట్ల పాత్ర కీలకమైందని ఆయన పేర్కొన్నారు. లోకో పైలట్లు నిర్లక్ష్యాన్ని విడనాడి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా రైలు నడపాలని సూచించారు. రైల్వే సంస్థ లోకో పైలట్లకు, గార్డ్ లకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని ఆయన వెల్లడించారు. రైల్వే సిబ్బంది సమన్వయంతో పని చేసినప్పుడే రైల్వే సంస్థ అనుకున్నా లక్ష్యాన్ని చేరుకుంటుందని అనే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిఎంఈ కమల్ కాంట్, సీనియర్ డిఈఈ కిరణ్ కుమార్, సీనియర్ డిఓఎం విద్యాధర్, సీనియర్ డిసిఎం అనిరుద్ ఫార్మర్, సీనియర్ డి ఈ ఎన్ కోఆపరేటివ్ ఆర్డినేషన్ దుర్గాప్రసాద్, డిఈఎన్ విష్ణు చౌదరి, డిఈఎన్ బి.రాము, సీనియర్ డిఎస్ టిఈ పావని, కాచిగూడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ కె.బాలాజీ, శైలేందర్ కుమార్ తో పాటు వివిధ శాఖల రైల్వే అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply