నేటి గ్రామ‌స్థాయి అధ్య‌క్షుల స‌మ్మేళ‌నం కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయండి – రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్

నేటి గ్రామ‌స్థాయి అధ్య‌క్షుల స‌మ్మేళ‌నం కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయండి

– రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్

———————————————————————————————————————————————————————————— ————————————————————————————————————————————————————————————— 

హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ఎల్‌బి స్టేడియంలో నేడు ( శుక్ర‌వారం ) జ‌రుగ‌నున్న గ్రామ‌స్థాయి అధ్య‌క్షుల స‌మ్మేళ‌నానికి ఏఐసిసి అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే హాజ‌ర‌వుకానున్నార‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, సికింద్రాబాద్ డిసిసి అధ్య‌క్షుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. ఈ సమ్మేళ‌నం విజ‌య‌వంతం చేసేందుకు గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌కుల స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్, ప‌రిశీల‌కులు క‌త్తి వెంక‌ట‌స్వామి, శ్రీనివాస్‌గౌడ్‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… ఎల్‌బి స్టేడియంలో నేడు జ‌రుగ‌నున్న గ్రామ‌స్థాయి అధ్య‌క్షుల స‌మ్మేళ‌న స‌భ‌కు ఏఐసిసి అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గే హాజ‌ర‌వుతున్న నేప‌ధ్యంలో ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌న్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు స‌భ‌కు త‌ర‌లిరావాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎ, బి బ్లాక్ ల అధ్య‌క్షులు విడి.కృష్ణ‌, అంజి యాద‌వ్‌, మాజీ కార్పొరేట‌ర్ వాజిద్‌, ప‌లు డివిజ‌న్ల అధ్య‌క్షులు అభిషేక్ కెన్న‌డి, పెండెం శ్రీనివాస్ యాద‌వ్‌, తిరుమ‌ల‌రావు, భాస్క‌ర్‌, పార్టీ సీనియ‌ర్ నాయకులు మారిశెట్టి న‌ర్సింగ్‌రావు, శీలం స‌త్య‌నారాయ‌ణ‌, కేశ‌వ్‌, యాద‌గిరి, పాశం అనిల్ కుమార్ యాద‌వ్‌, జ‌యేంద‌ర్ బాబు, బంటారం యాద‌గిరి గౌడ్, జ‌గ‌దీష్‌, లింగం గుప్త‌, రాజ్‌దీప్‌, ర‌మేష్‌గౌడ్‌, యూత్ కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు న‌రేంద‌ర్ యాద‌వ్, డివిజన్ నాయకులు, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ యూనియన్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.————————————————————————————————————————————————————————————

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page