బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్ల పై మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సమీక్ష
తార్నాక, అక్టోబరు 9, ( అద్దం న్యూస్ ) :
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తార్నాక డివిజన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తార్నాక డివిజన్ పరిధిలో బతుకమ్మ పండుగ కోసం బతుకమ్మ పాండ్లను ఏర్పాటు చేయాలని, వీధి దీపాల నిర్వహాణ, పారిశుద్ధ్య పనులు, రహదారుల శుభ్రత, చెత్త తొలగింపు, డ్రైనేజీ సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
