Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఆప్ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయండి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ...

ఆప్ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయండి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ :    నల్గొండ టౌన్‌లో మే 3వ తేదీన జ‌రుగ‌నున్న‌ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేక‌రుల సమావేశంలో ఆప్ నేతలు బుర్ర రాములు గౌడ్, ఎండి.మజీద్, డాక్ట‌ర్‌.అన్సారీ, జావీద్ షరీఫ్, అడ్డంకి రవీందర్, దర్శనం రమేష్, అబ్దుల్ ముఖ్తఅధిర్, అఫ్సర్ సలాం, మోమిన్, శివాజీ, కుత్బొద్దీన్, రాజమల్లయ్య, అజీమ్ బేగ్, షాబాజ్, నాగార్జున, జి.అంజన్న, ధర్మేంద్ర తివారి, కొడంగల్ శ్రీనివాస్ లతో కలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆప్ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సు గోడ పత్రికను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఆప్ ను బలోపితం చేసేందుకు, పార్టీ పునర్నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే సంపూర్ణ రాజకీయ వాతావరణం సృష్టించేందుకు ఈ సదస్సులో చేర్చిస్తామని తెలిపారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తిగా ఆప్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతుందని.. అందులో భాగమే ఈ సదస్సు ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుకు ఆప్ తెలంగాణ రాష్ట్ర బాద్యులు, మాజీ ఎమ్యెల్యే దిలీప్ పాండే హాజరవుతున్నారని, ప్రతి ఆమ్ క్రియాశీల కార్యకర్త ఈ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page