Friday, September 18, 2026
HomeHyderabadఈ నెల 23 న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయండి – వామపక్ష...

ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాలు

ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయండి

– వామపక్ష విద్యార్థి సంఘాలు



హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :    హైదరాబాద్ జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ పిడిఎస్‌యు రాష్ట్ర కార్యాలయమైన మార్క్స్ భవన్‌లో బంద్‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పిడిఎస్‌యు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంద నవీన్, కంచనపల్లి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, పిడిఎస్‌యు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాకేష్, హరీష్, పిడిఎస్‌యు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గణేష్ లు హాజరై మాట్లాడుతూ… గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందన్నారు. కెసిఆర్‌ను గద్దే దించే పోరాటల్లో ఈ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదలు మేము చేయము పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు బకాయిలను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని, నిరుద్యోగ సమస్య తీరుస్తామని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనా అందిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరలు కావొస్తున్న పెండింగ్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయ‌డంలేద‌న్నారు. ప్రజా పాలనా అని మాటల్లో చెపుతూ ఆచరణలో అప్రజాస్వామ్య పాలనా కొనసాగుతుందన్నారు. అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ఫీజు నియంత్రణ‌ చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్యా సంస్థల బంద్ కార్యక్రమంలో పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమలో నాయకులు నాగేంద్ర, గౌతమ్, ఆసిఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page