శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన మ‌ల్ల‌న్న జాత‌ర‌

శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన మ‌ల్ల‌న్న జాత‌ర‌

హైదరాబాద్, జ‌న‌వ‌రి 12, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ న‌గ‌రం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ బాకారంలో ప్ర‌సిద్ధి చెందిన శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో మ‌ల్ల‌న్న జాతర మ‌హోత్స‌వాలు సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా తొలి రోజు ఉద‌యం దృష్టి కుంభం, శాంతి హోమాన్ని నిర్వ‌హించారు. ఆల‌య‌ మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి, ఆలయ మాజీ చైర్ పర్సన్ నల్లవెల్లి ఊర్మిళ అంజిరెడ్డి, నల్లవెల్లి మల్లికార్జున రెడ్డి లు దృష్టి కుంభం, శాంతి హోమాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి మాట్లాడుతూ… ప్ర‌తి ఏటా మాదిరిగానే ఈ సంవ‌త్స‌రం కూడా మ‌ల్ల‌న్న జాతర మ‌హెత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న మ‌ల్ల‌న్న జాత‌ర మ‌హోత్స‌వాల్లో విశేష పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన స్వామివారి ప్రత్యేక అలంకరణ, 14న పంచామృత అభిషేకాలు, సాయంత్రం గంగతెప్ప ఊరేగింపు, 15న మ‌ల్ల‌న్న స్వామివారితో బ‌లిజ మేడాల‌మ్మ‌, గొల్ల కేత‌మ్మ అమ్మ‌వార్ల‌తో కళ్యాణం, అగ్నిగుండాల‌ ప్రవేశం, బోనాల సమర్పణ, భోల‌క్‌పూర్ ఇందిరాన‌గ‌ర్‌లో గ‌ల ఈద‌మ్మ పోచ‌మ్మ దేవాల‌యంలో బోనాల స‌మ‌ర్ప‌ణ‌, 16న మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రఘు, పూజారి మధుసూదన చారి, కాంగ్రెస్ నేతలు నరేందర్, లింగం గుప్తా, వైపి.రాజు, పెండెం శ్రీనివాస్ యాదవ్, పట్నం నాగభూషణం గౌడ్, పీటర్, రాజేష్, బీఆర్ఎస్ నేత కర్ణ ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page