...

చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి

చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి

సికింద్రాబాద్‌, జూన్ 19, ( అద్దం న్యూస్ ) :   గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌తిస్థిమితం లేని వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న చిల‌క‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద మ‌తిస్థిమితం లేకుండా ఓ వ్య‌క్తి ప‌డి ఉండ‌టాన్ని చిల‌క‌ల‌గూడ పెట్రో కార్ సిబ్బంది అత‌నిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించి అడ్మిట్ చేశారు. ఆ వ్య‌క్తి చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందాడు. మృతి చెందిన వ్య‌క్తిని ఎవ‌రైనా గుర్తిస్తే చిల‌క‌ల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌కు నేరుగా అయినా, చిల‌క‌ల‌గూడ ఇన్‌స్పెక్ట‌ర్ 87126 60218, చిల‌క‌ల‌గూడ ఏసిపి 87126 61252 ఫోన్ నంబ‌ర్ల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని పోలీసులు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.