ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
హైదరాబాద్, జూన్ 19, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గాంధీ భవన్‌తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాల్లో వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లల్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. బాగ్‌లింగంపల్లి డివిజన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ లు హాజరై యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ డిసిసి సెక్రెటరీ, ఉజ్జయిని మహంకాళి ఆలయ ట్రస్ట్ కమిటీ మెంబర్ గుండెల్లి దేవి వరప్రసాద్ లతో కలిసి కేక్ కట్ చేశారు.













Leave a Reply