దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ పై మందకృష్ణది వితండవాదం
– హిందు మాదిగ ఐక్య వేదిక
హైదరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ : దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ను కొనసాగించాలని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ చేస్తున్నది వితండవాదమని ముషీరాబాద్ నియోజకవర్గం హిందూ మాదిగ ఐక్య వేదిక నాయకులు గడ్డం నవీన్, సూర్యనారాయణ లు అన్నారు. మాదిగ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాల కొనసాగించాలని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో సోమవారం సాయంత్రం నియోజకవర్గం హిందూ మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ మాదిగ ఐక్య వేదిక నాయకులు గడ్డం నవీన్, సూర్యనారాయణ లు మాట్లాడుతూ… దళితులుగా ఉండి క్రైస్తవ మాతంలోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదన్నారు. క్రిస్టియన్‌గా మారి హిందూ ఎస్సీ రిజిస్ట్రేషన్ హక్కులు కావాలని అడగడం నిజమైన హిందూ మాదిగ అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. క్రైస్తవులుగా మారిన వారిని క్రిస్టియన్ అనే పేలుస్తారన్నారు. దళిత క్రిస్టియన్ అని ఎక్కడ పిలవరన్నారు. ఇది ముమ్మాటికీ నిజమైన హిందూ దళితులను మోసం చేయడమే అవుతందని, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న హిందూ మాదిగలు ఒక్కతాటిపై వచ్చి పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ మాదిగ ఐక్య వేదిక నాయకులు ఎర్రోళ్ల సతీష్, వెంకటేష్, కేశవపురం స్వామి, బర్కు కృష్ణ, హరీశ్ కుమార్, నరేష్, రోమాల సాయిరాజ్, నర్సింగ్, కొలిపాక మోహన్, మహేష్, లడ్డు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply