గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలి – ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు

గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలి

– ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు

హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :  గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలని ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు అన్నారు. సోమ‌వారం సాయంత్రం ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌హ్మ‌దీయా ఫంక్ష‌న్‌హాల్‌లో గ‌ణేష్ ఉత్స‌వ నిర్వాహ‌కుల‌తో స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ… గ‌ణేష్ ఉత్స‌వాల్లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా చూసుకోవాల‌న్నారు. మండ‌ప నిర్వాహ‌కులు మండ‌పాల వ‌ద్ద అన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌న్నారు. గ‌ణేష్ న‌వ‌రాత్రుల‌తో పాటు నిమ‌జ్జ‌నం స‌జావుగా జ‌రిగేట‌ట్టు చూసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో డిఐ న‌దీమ్ హుస్సేన్‌, ఎస్ఐ లు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page