అంజన్ కుమార్ యాదవ్, అరవింద్ కుమార్ యాదవ్‌లను సన్మానించిన మారిశెట్టి నర్సింగరావు
ముషీరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం జరిగిన శ్రీరామ నవమి వేడుకలకు ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ మారిశెట్టి నర్సింగరావు ఆధ్వర్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ లను సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం సత్యనారాయణ, బాబ్జి, గుండు జగదీష్ బాబు, అభిషేక్, సురేష్ యాదవ్, నరేందర్ యాదవ్, సాల్మన్ రాజ్, నవీన్ కుమార్, శ్రీనివాస్, భాస్కర్, మధుమతి, కవిత, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply