మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ‌ర్త‌ర‌ప్‌ చేయాలి – న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌

 

కో– ఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావును సస్పెండ్ చేయాలి

 మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బ‌ర్త‌ర‌ప్‌ చేయాలి

– న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌

హైదరాబాద్, అద్దం న్యూస్ :   చిత్రపురి అవినీతి, అక్రమాల‌కు పాల్ప‌డిన కో – ఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావును సస్పెండ్ చేయాలని, సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ను బ‌ర్త‌ర‌ప్ చేయాల‌ని న‌వ‌దోయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఆమ్ ఆద్మీ, సేవాలాల్ సేన నాయ‌కులు డిమాండ్ చేశారు. చిత్రపురి అవినీతి, అక్రమాలపై సంవత్సరాల నుండి పోరాడుతున్న బాధితుల డిమాండ్స్ తో శ‌నివారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో ధ‌ర్నా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా న‌వోదయం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు శివ‌శంక‌ర్ ప‌టేల్ మాట్లాడుతూ… చిత్ర‌పురి కాల‌నీ అవినీతి, అక్ర‌మాల‌పై యాక్ట్ 51 ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోంద‌ని, మాధవరెడ్డి రిపోర్ట్ వచ్చి రెండు సంవత్సరాలు, గౌరవ తెలంగాణా ఉన్నత న్యాయస్థానం గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతీ సంవత్సరం ఆదేశాలు ఇస్తూనే ఉంద‌ని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారుల మీద కంటెంప్ట్ కేసులు కూడా నాలుగు సంవత్సరాల నుండి నడుస్తూనే ఉన్నాయ‌ని.. దీనికి అంతటికీ కారణం సహకార శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన రావులే అని అన్నారు. ధ‌ర్నాకు అధ్యక్షత వహించిన చిత్రపురి సాధన సమితి నాయకులు భద్ర మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో రఘనందన్ రావు తీవ్రమైన చెడ్డ పేరు తీసుకువస్తున్నారని, ఆయన చరిత్ర పూర్తిగా అవినీతి మయమైపోయిందన్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వ‌ర‌రావును కూడా ఈ అధికారి చెడగొట్టాడని, చిత్రపురి అవినీతికి ప్రధాన కారకుడు వల్లభనేని అనిల్ కుమార్‌ను పెంచి పోషిస్తున్నారని, వీరి సీఎం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఆమ్ ఆద్మీ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… చిత్రపురి అవినీతి, అక్రమాలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రెస్‌క్ల‌బ్‌లో నిర్వహించామని తెలిపారు. తెలంగాణ మేధావులు అందరూ కూడా మద్దతుగా నిలిచారని, భవిష్యత్ లో ఇంకా కలిసి పోరాటాలు చేద్దామని, చిత్రపురి కమిటీ రద్దు అయ్యేవరకూ వదిలే సమస్యే లేదన్నారు.

ఏఐటీయూసీ తెలంగాణా రాష్ట్ర ఉప కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ… చిత్రపురి అవినీతి పై పోరాటంలో ఏఐటీయూసీ మొదటి నుండి ముందు వరసలో ఉందని, భవిష్యత్ లో మరిన్ని ధర్నాలు చేసి చిత్రపురి సంగతి తెలుస్తామన్నారు. రాబోయే అసెంబ్లీలో కూడా సిపిఐ ఎమ్మ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం గార్లతో ప్రస్తావన తీసుకొచ్చి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విధంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సీఐటీయూ నాయకులు కుమార్ మాట్లాడుతూ… వల్లభనేని అనిల్ కుమార్ అవినీతి సినిమా పరిశ్రమ మొత్తం పాకిపోయిందని, తగిన శాస్తి జరిగేవరకూ సీఐటీయూ పోరాడుతుందని, రఘనందన్ రావు ని సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ ధ‌ర్నాలో చిత్రపురి సాధన సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, సంకూరి రవీందర్, మిలిటరీ ప్రసాద్, రామావేణి, ఉమ, జయ, లలిత, రాజు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page